టీమిండియా యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ తన తొలి అంతర్జాతీయ వన్డే సెంచరీని నమోదు చేశాడు. హరారే వేదికగా జింబాబ్వే తో మూడో వన్డేలో గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 170 పరుగులు సాధించాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను గిల్ తన ఖాతాలో వేసుకున్నాడు.
వన్డేల్లో జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వే తో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్ అజేయంగా నిలిచాడు.
తాజా మ్యాచ్ లో 130 పరుగులు సాధించిన గిల్ సచిన్ 24 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. కాగా హరారే వేదికగా జింబాబ్వే తో జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0 తో క్వీన్ స్లీప్ చేసింది.