T20WorldCup 2024: టి20 ప్రపంచ కప్ విశ్వవిజేతగా టీమిండియా.. 17 సంవత్సరాల తర్వాత..!

-

టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ విశ్వ విజేతగా టీమిండియా అవతరించింది. దాదాపు 17 సంవత్సరాల తర్వాత టి20 ప్రపంచ కప్ విశ్వవిజేతగా… టీమిండియా రికార్డు సృష్టించింది. ఇవాళ ఫైనల్స్ లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో… ఏడు పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన సౌత్ ఆఫ్రికా ఎనిమిది వికెట్లు నష్టపోయి 170 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా… 2024 t20 ప్రపంచ కప్ ఛాంపియన్గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version