లండన్ వీధుల్లో విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

-

Virat Kohli spotted strolling in London: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో… హాలిడే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే ఇండియాను వదిలేసి లండన్ లో… మంచి విల్లా కొనుక్కున్నాడు విరాట్ కోహ్లీ. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లండన్ లోనే ఉండాలని నిర్ణయం కూడా తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టీమిండియా 42 రోజుల పాటు ఎలాంటి క్రికెట్ లేకుండా రిలాక్స్ మూడులో ఉంది.

Virat Kohli spotted strolling in London

ఈ తరుణంలో టీమిండియా క్రికెటర్ లండన్ వీధుల్లో సందడి చేస్తున్నారు. ఓ సామాన్య పౌరుడి లాగా రోడ్డు దాటేందుకు డివైడర్ వద్ద నిలబడ్డాడు విరాట్ కోహ్లీ. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విరాట్ కోహ్లీ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రికెటర్ అయి కూడా సామాన్యుడిలా రోడ్డు దాటుతున్నాడని విరాట్ కోహ్లీని పొగుడుతున్నారు. కాగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ అత్యంత దారుణమైన ప్రదర్శన… కనపరిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version