మరోసారి రవితేజతో రొమాన్స్‌ చేయనున్న శ్రీలీల

-

ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్‌ చిత్ర పరిశ్రమలో ఫేమస్‌ అవుతుంటారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు శ్రీలీల పేరు బాగా వినిపిస్తోంది. అయితే.. వరుస సినిమాలతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు .. నితిన్ .. రామ్ .. విజయ్ దేవరకొండ .. వైష్ణవ్ తేజ్ .. నవీన్ పోలిశెట్టి సినిమాలతో బిజీగా ఉంది. ఈ జాబితాలో బాలకృష్ణ సినిమాలో మాత్రం ఆయన కూతురిగా కనిపించనుంది.

Actress Sreeleela spells magic on us with her beautiful pictures | -  Sreeleela, Sreeleela Hot

ఇక ఈ సినిమాల కంటే ముందు శ్రీలీల చేసిన సినిమా .. అవకాశాలు ఆమెకి ఈ రేంజ్ లో వచ్చి పడటానికి కారణం .. ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఆమె చేసిన ఈ సినిమా, కథాకథనాల పరంగా .. మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. శ్రీలీల డాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది.

ఈ నేపథ్యంలోనే మరోసారి ఆమె రవితేజ సరసన నటించనున్నట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసమే శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే మరోసారి మాస్ మహారాజ్ అభిమానులకు పండగే.

Read more RELATED
Recommended to you

Latest news