అత్యంత ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. అక్కడి ప్రజలు నిత్యావసరాలు కొనుక్కొవాలనుకున్నా… ధరలు చుక్కలను అంటుతున్నాయి. సామాన్యుడు కొనుగోలు చేయాలంటే కొనలేని పరిస్థితి ఉంది. శ్రీలంక ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, నిత్యావసరాల, ఆహార వనరులపై నియంత్రణ లేకపోవడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. కోడి గుడ్డు ఒకటి రూ.35, కిలో చికెన్ రూ.1000, కేజీ ఉల్లి రూ.200, పాలపొడి రూ.2000, మూతపడ్డ రెస్టారెంట్స్, హోటళ్లు. పెట్రోల్ లీటర్ రూ.283, డీజిల్ లీటర్ రూ.220 ఇలా అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయి.
చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇలా నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో… ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితిలో ఉంది. గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోవడంతో దేశ వ్యాప్తంగా 90 శాతం రెస్టారెంట్లు, హోట్లళ్లు మూతపడ్డాయి. 1970 కరువు పరిస్థితుల తర్వాత వచ్చిన అతిపెద్ద సంక్షోభం ఇదే అని అక్కడ ఆర్థికవేత్తలు అంటున్నారు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండటంతో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బాధ్యత వహిస్తూ… అధ్యక్షుడ గోటబయ రాజపక్సే రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.