Asia Cup : నేటి నుంచే ఆసియాకప్… శ్రీలంకను ఢీ కొట్టనున్న ఆఫ్ఘనిస్తాన్

-

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఆసియా కప్ ఫీవర్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి నుంచే ఆసియా కప్‌ ప్రారంభం కానుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడి పరిస్థితుల దృశ్య ఈ టోర్నీని యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే. ఈ ఆసియా కప్ ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 11 వరకు జరగనుంది. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటాయి.

ఇందులో ఐదు జట్లు (భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్) ఇప్పటికే అర్హత సాధించాయి. ఒక టీం కోసం నాలుగు జట్లు (హాంకాంగ్, కువైట్, సింగపూర్, యూఏఈ) పోటీపడ్డాయి. ఇందులో ఆరవ జట్టుగా హాంకాంగ్ అర్హత సాధించింది. ఇక ఆసియా కప్‌ లో భాగంగా ఇవాళ్టి మ్యాచ్‌ శ్రీలంక వర్సెస్‌ ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ దుబాయ్ లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. మన భారత కాలమానం ప్రకారం… ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, భానుక రాజపక్స, కుసల్ మెండిస్, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, చమిక కరుణరత్నే, జెఫ్రీ వాండర్సే, అసిత ఫెర్నాండో.

ఆఫ్ఘనిస్తాన్ : హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఉస్మాన్ ఘనీ, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఫరీద్ అహ్మద్.

Read more RELATED
Recommended to you

Exit mobile version