భద్రాద్రిలో శ్రీరామనవమి బ్రహ్సోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఈ నెల 16 వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా వైరస్ కారణంగా శ్రీరామ నవమి నిరాడంబరంగా చేశారు. అయితే ఈ సారి కరోనా ప్రభావం లేక పోవడంతో భక్తుల మధ్య శ్రీ సీత రాముల కల్యాణం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
అందు కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తి చేశారు. ఈ కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 9వ తేదీన ఎదుర్కోలు ఉండనుంది. అలాగే 10 వ తేదీన కల్యాణం, 11వ తేదీన పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రంలో తో పాటు ఆంధ్ర ప్రదేశ్ నుంచి కూడా భారీ గా భక్తులు వచ్చే అవకాశం ఉంది.
అలాగే దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు. ఈ వేడుకల కోసం 175 క్వింటల్ల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. అలాగే 3 లక్షల లడ్డూలను కూడా సిద్ధం చేస్తున్నారు.