వారసుడులో శ్రీకాంత్ రోల్ ఏమిటో తెలుసా?

-

వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కీలక పాత్రలో మెప్పించారు. తమిళంలో ఆయన నటించిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా వారసుడు చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో విజయ్ సోదరుడిగా నటించానని తెలిపారు.

“విజయ్ సోదరుడిగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించాను. బ్రదర్స్, సిస్టర్స్ మధ్య నడిచే అద్భుతమైన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. తెలుగు, తమిళం రెండు భాషల్లోను విడుదల కానుంది. ఇది పూర్తిగా తెలుగు నేటివీటికి తగినట్లుగా ఉంటుంది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న చాలా మంది నటీనటులు ఇందులో నటించారు” అని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version