ఈ మధ్య కాలంలో మోసాలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి వాటితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మోసగాళ్ళు కూడా ఎక్కువై పోతున్నారు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెసేజ్లు పంపినట్లు సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త నేరాలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెట్టు కూడా ఒక పోస్ట్ ని షేర్ చేసింది. ఎస్బీఐ ఖాతా బ్లాక్ అయింది. దాన్ని పునరుద్ధరించడానికి డాక్యుమెంట్ ను వెంటనే అప్డేట్ చేయాలని మెసేజ్ లు వస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది చూస్తే.. ఎస్బీఐ ఖాతా బ్లాక్ అయింది అంటూ వస్తున్న మెసేజ్ల లో ఏ మాత్రం నిజం లేదు.
అయితే సైబర్ కేటుగాళ్లు మెసేజ్లు పంపించిన లింక్ పై క్లిక్ చేయవద్దు. ఒకవేళ క్లిక్ చేశారంటే ఖాతా సున్నా అయిపోతుంది. కాబట్టి అలాంటి మెసేజ్లు తో జాగ్రత్తగా ఉండండి. అలానే వాటిని ఇతరులకి ఫార్వర్డ్ చెయ్యొద్దు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఖాతాదారులకు సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా నేరాలపై వస్తున్న వార్తలను చెబుతోంది.