క‌ర్ర‌లు, ఈటెల‌తో కొట్టుకున్న జాల‌ర్లు.. ఆపేందుకు పోలీసులు ఏకంగా..

-

గ్రామాల మ‌ధ్య విభేదాలు ఉండ‌టం చాలా స‌హ‌జం. సరిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌నో లేదంటే ఏదైనా చెరువుల విష‌యంలో మ‌న‌కు ఇవి ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడ కూడా రెండు గ్రామాలు ఓ రేంజ్‌లో కొట్టుకున్నాయి. అయితే ఇవికొట్టుకున్న‌ది మాత్రం ప్ర‌భుత్వం తీసుకున్న ఓ నిర్ణ‌యం వ‌ల్ల‌. మ‌న‌కు స‌హ‌జంగానే ఇలాంటి పెద్ద గొడ‌వ‌లు అంటేనే సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి. ఎందుకంటే గొడ‌వ‌లు అంటేనే మ‌న ఇండియాలో అంత ఆస‌క్తి ఉంటుంది మ‌రి. ఇక ఇప్పుడు కూడా మ‌నం చెప్పుకోబోయేది అలాంటి దాని గురించే.

కాగా మ‌న దేశంలో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఈ దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింద‌ని వార్తలు వ‌స్తున్నాయి. అదేంటంటే ఇక్క‌డ గ్రామాల ప్ర‌జ‌లు అన‌గా జాలర్లు ఎక్కువ‌గా చేప‌లు ప‌ట్టేందుకు స‌ముద్రంలోకి వెళ్తుంటారు. అయితే వారు అందుకు వినియోగించే కొన్ని వలలపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటితో పాటే వారు ఉప‌యోగించే కొన్ని పడవలపై కూడా ఆంక్ష‌లు విధించి వాటిల్లో కొన్ని రకాల ఇంజిన్ల‌నే వాడాలంటూ చెప్పిది.

అయితే ఇక్కడ స్థానికంగా ఉండే వీరాపట్నం, అలాగే నల్లవాడు గ్రామాల్లో ఉండే జాల‌ర్లు మొద‌టి నుంచి రెండు వ‌ర్గాలుగావిడిఓయి ప్ర‌భుత్వం తెచ్చిన ఆంక్ష‌ల‌ను ఒక వ‌ర్గం పాటిస్తే మ‌రో వ‌ర్గం మాత్రం వ్య‌తిరేకిస్తోంది. ఇక ఈ విష‌యంలో జాలర్లు ఓ రేంజ్‌లో రెచ్చిపోయి శ‌న‌వారం కొట్టుకున్నారు. స‌ముద్ంర‌లో ఒక ఊరు వారు ఈ నిషేధిత వ‌స్తువుల‌ను వాడ‌టంతో ఇంకో ఊరు వారు వ‌చ్చి పెద్ద క‌ర్ర‌లు, ఈటెల‌తో ఇరు గ్రామాల వారు కొట్టుకున్నారు. ఇక ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో వారు చాలా సాల‌ర్ఉ గాల్లో కాల్పులు జరిపి గొడ‌వ‌ను చ‌ల్లార్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version