కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన ఆచారాలు ఉన్నాయి..అవి తప్పక పాటిస్తే మంచి జరుగుతుంది లేకుంటే నరకానికి వెలతారు అని నమ్ముతారు..ప్రపంచం ఓ వైపు సాంకేతికంగా.. ప్రగతి పథంలో దూసుకుపోతుంటే.. మరోవైపు.. కొంతమంది గిరిజన తెగలు తమ పూర్వ సంస్కృతులను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు.అడవులలో నివసిస్తున్న అనేక తెగల వారు ఆధునికతకు దూరంగా.. ఆటవిక జీవితాన శైలిని దగ్గరగా జీవిస్తున్నారు.
చిన్నపుడు పాఠ్యపుస్తకాలలో చదువుకున్నట్టుగా వారు ఆదిమ మానవుల వలె అడవిలోనే జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వారి ఆహారం, జీవనశైలి చాలా విచిత్రంగా అనిపిస్తుంది.ఇండోనేషియాలోని పాపువా న్యూ గినియాలో నివసించే ‘డాని’ తెగకు చెందిన ఆదివాసీల ఆచారాలు గురించి వింటే మీకు మతులు పోతాయి. ఇప్పటికీ ఇలాంటి సంప్రదాయాలను పాటించే వారున్నారా అనే సందెహాలు కలగడం విశేషం.
83 సంవత్సరాల క్రితం వరకూ ఈ ప్రపంచానికి తెలియనే తెలియదు. కొంతమంది కాస్త చొరవ తీసుకొని, ఆ గిరిజన ఆచార వ్యవహారాలను ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో వారిని కలవగా ఇలాంటి వింత వింత ఆచారాలు వెలుగు చూశాయి..ఆ వింత ఆచారం ఏంటంటే.. ఇంట్లో ఎవరైనా మరణిస్తే వారు ఆ మృతదేహాన్ని పూర్తిగా కాల్చరు.
అలా సగం కాల్చిన తరువాత ఆ మృతదేహాలను ఇంటిలోనే దాచుకుంటారు. అలాగే వీరి అత్యంత ప్రమాదకరమైన మరో ఆచారం ఏమిటంటే, ఎవరైనా చనిపోయినప్పుడు.. ఆ వ్యక్తి కుటుంబంలో ఉన్న స్త్రీ వేలుని కత్తిరిస్తారు. ఇలా ఒక్కసారి కాదు, చనిపోయిన ప్రతి సారీ ఇలా చేస్తారట. అంటే తమ ఇళ్లల్లోని కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడల్లా స్త్రీ ఒకొక్క వేలు కత్తిరించబడుతుందని అర్ధం..వీరి జీవన విధానాల గురించి తెలపడం కోసం ఓ సినిమాను కూడా తెరకెక్కించారట.