హైదరాబాద్ లోని అంబర్ పేటకు చెందిన నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం రోజు తండ్రి పనిచేస్తున్న కారు సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లిన చిన్నారిని వీధి కుక్కలు వెంటాడాయి. కుక్కలను చూసి భయపడిన బాలుడు వాటి నుండి తప్పించుకునేందుకు పరుగులు తీశాడు. అయినా అవి చిన్నారిని వదలకుండా తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లు, చేతులు లాగడంతో బాలుడికి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తండ్రి హుటాహుటిన వచ్చి కుక్కలనుండి బాలుడిని రక్షించి ఓ ప్రైవేటు వాసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళ సై ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాలుగేళ్ల బాలుడి పై వీడి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే పరిష్కారాలు వెతకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Pained to see this sad incidence. Only such painfull incidences should not remind us the need for permanent solutions.Administration should take some proactive measures. This incidence prooves that existing arrangements are not adequate to combat this menace. No words 2 console https://t.co/BlLvLCunGl
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 22, 2023