మహిళల కోసం ఎల్ఐసీలో సూపర్ ప్లాన్.. రూ.4 లక్షలు రిటర్న్స్ పొందే ఛాన్స్..

-

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసి ఎన్నో పథకాలను అందిస్తుంది.. ఇప్పుడు మహిళా దినోత్సవ సందర్బంగా ఇప్పుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది..మహిళల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. మహిళల కోసం ప్రత్యేకంగా ఓ ఎల్ఐసీ పాలసీ అందిస్తోంది. ఎల్ఐసీ ఆధార్ శిల పేరుతో ఈ పాలసీ అందుబాటులో ఉంది. ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, సేవింగ్స్ లైఫ్ ఇన్స్యూరెన్స్ పథకం. కేవలం మహిళలు మాత్రమే ఈ పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. మహిళలకు సేవింగ్స్‌తో పాటు రక్షణ కూడా అందించడం ఈ పాలసీ స్పెషల్..ఈ పాలసీ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఇది మహిళల కోసమే అయినా కూడా బాలికలు కూడా ఈ పథకాన్ని తీసుకోవచ్చు..ఈ పాలసీ తీసుకోవాలంటే 8 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయస్సు 55 ఏళ్లు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్ల నుంచి 20 ఏళ్లు. సమ్ అష్యూర్డ్ విషయానికి వస్తే కనీసం రూ.2,00,000 నుంచి గరిష్టంగా రూ.5,00,000 వరకు పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఓసారి చెల్లించవచ్చు.. మీకు ఇప్పుడు 30 ఏళ్ల వయస్సు ఉంటే రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకుంటే… రోజూ రూ.30 చొప్పున ఏటా రూ.10,959 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.3,97,000 రిటర్న్స్ వస్తాయి. చెల్లించిన ప్రీమియంతో పాటు బోనస్ కూడా వస్తుంది కాబట్టి మంచి రిటర్న్స్ వస్తాయి..

అలాగే 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.2,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్ల టర్మ్ ఎంచుకొని ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకున్నారనుకుందాం. రోజూ రూ.22 చొప్పున ఏటా రూ.7,860 ప్రీమియం చెల్లించాలి. మెచ్యూరిటీ నాటికి రూ.2,33,000 రిటర్న్స్ వస్తాయి…పాలసీ తీసుకున్న మహిళ పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే నామినీకి డబ్బులు చెల్లిస్తుంది ఎల్ఐసీ. పాలసీ తీసుకున్న ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత మరణిస్తే లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది.. రెండేళ్లు ప్రీమియంలు కరెక్ట్ గా చెల్లిస్తే లోన్ పొందే అవకాశాలున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news