ఎమ్.ఎస్. ధోనీకి సుప్రీంకోర్టు నోటీసులు

-

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆమ్రపాలి గ్రూప్ కేసులో ధోనీకి సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఆమ్రపాలి కంపెనీ తనకు రావలసిన రూ. 40 కోట్ల పారితోషకాన్ని ఎగ్గొట్టిందని ఆరోపిస్తూ 2019 మార్చిలో ధోని సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. అయితే 2019 అక్టోబరులో ఆమ్రపాలి సంస్థ ఎంఎస్ ధోని మధ్య ఆర్థిక వివాదాన్ని మధ్యవర్తిత్వం చేయడానికి మాజీ న్యాయమూర్తిని మధ్యవర్తిగా హైకోర్ట్ నియమించింది. అయితే ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్యవర్తిత్వాన్ని నిలిపివేయాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.

గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ధోని బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశాడు. ధోని బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (RSMPL) తో అమరపాలి గ్రూప్ శ్యామ్ ఒప్పందాలు కుదుర్చుకొని ఇళ్ల కొనుగోలుదారుల సొమ్మును అక్రమంగా మళ్ళించిందని సుప్రీంకోర్టు నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్లు ధర్మాసనానికి తెలిపారు. సోమవారం న్యాయమూర్తులు యూయు లలిత్, బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం పెండింగ్ లో ఉన్న ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్ ల గురించి తెలియజేసింది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు, గృహ నిర్మాణ ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసి, కొనుగోలుదారులకు ఇళ్లను అందజేసేందుకు కోర్టు రిసీవర్ను నియమించినట్లు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news