జీవో నంబర్ 46పై రేవంత్ సర్కారుకు సుప్రీంకోర్టు నోటీసులు

-

రాష్ట్రంలో చేపట్టిన స్పెషల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌(ఎస్పీ)పై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు రేవంత్ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. బాధితుల తరపున సుప్రీం సీనియర్‌ న్యాయవాదులు ఆదిత్య సొంది, విద్యాసాగర్‌, మిథున్‌ శశాంక్‌ వాదనలు వినిపించారు. విచారణకు బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, ఏనుగుల రాకేశ్‌రెడ్డి హాజరయ్యారు.

విచారణ అనంతరం దాసోజు మాట్లాడుతూ..ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ సర్కార్ పంతానికి పోకుండా జీవో 46 బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 46ను రద్దు చేసి, బాధితులను ప్రభుత్వ ఉత్సవాల్లో భాగస్వాములు చేయాలని కోరారు. బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం కేటీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. కేటీఆర్‌ సహకారంతో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.ఈ నెల 27న సుప్రీంలో జరిగే తదుపరి విచారణ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version