వివాదంలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల.. !

-

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ దర్శకత్వంలో పెళ్లి సందD సినిమా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. హీరో శ్రీకాంత్.. నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా… ఈ సినిమాను తెరకెక్కించారు. పెళ్లి సందడి సినిమా కు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించగా పెళ్లి సందD సినిమా కు మాత్రం ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకత్వం వహించారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లిసందD సినిమా లో హీరోగా శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించగా హీరోయిన్ గా తెలుగు అమ్మాయి శ్రీ లీల నటించింది.

ఇక దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా విడుదలై మంచి టాక్ కూడా తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా పెళ్లి సందD సినిమా హీరోయిన్ శ్రీ లీల ఓ కొత్త వివాదంలో చిక్కుకుంది. శ్రీ లీల స్వస్థలం విజయవాడ. అయితే ఆమె తన కూతురు కాదంటూ ప్రముఖ వ్యాపార వేత్త సూపర్ సుధాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీల కు తనకు ఎలాంటి సంబంధం లేదని సుధాకర్ రావు అన్నారు. శ్రీ లీల తన మాజీ భార్య కుమార్తె అని… తాము విడిపోయిన తర్వాత స్త్రీలకు తన మాజీ భార్య జన్మనిచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. తన ఆస్తులపై క్లీన్ చేయడానికి తన పేరు ఆడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయం లోకి అనవసరంగా తన పేరు లాగడం పై మండి పడుతున్న ఆయన… హద్దులు దాటితే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. అయితే దీనిపై హీరోయిన్ శ్రీ లీల ఇంకా స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version