ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో సుస్మితా సేన్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

-

బాలీవుడ్‌ అందాల తార, మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ సుస్మితా సేన్‌ వెండితెరపైనే కాదు డిజిటల్ స్క్రీన్ పైనా అలరిస్తోంది. ఇప్పటికే ఆర్య వెబ్ సిరీస్ తో డిజిటల్ బాట పట్టిన సుస్మితా సేన్.. ఆ బాటలోనే తన ప్రయాణం కొనసాగిస్తోంది. ఇటీవలే వచ్చిన ఆర్య సీజన్-2తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సిరీస్ కు ఇటు ప్రేక్షకులతో పాటు.. అటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా ఈ మాజీ విశ్వ సుందరి మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం ప్రకటించింది. ‘తాలి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో సుస్మితా సేన్ ట్రాన్స్ జెండర్ పాత్రలో అలరించనుంది. ఇందులో సుస్మిత ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్ట్‌ గౌరీ సావంత్‌ పాత్రను పోషిస్తోంది. తాజాగా ఈ సిరీస్‌లో తన లుక్‌ను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది సుస్మిత.

‘‘అందమైన వ్యక్తి కథను అంతే అందంగా ఈ ప్రపంచంలోకి తీసుకురావడం ఆనందంగా ఉంది’’అని పోస్ట్‌ చేసింది సుస్మిత. ఈ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోయేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. మరోవైపు సుస్మితా లుక్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ పాత్రను పోషించే సత్తా సుస్మితాకు తప్ప వేరే ఎవరికీ లేదంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version