శరీరంలో పోషక విలువలు సరైన విధంగా ఉంటే పూర్తి ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పుడైతే పోషక విలువల లోపం ఏర్పడుతుందో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తాయి. ముఖ్యంగా ఐరన్ వంటి పోషకాలు శరీరంలో ఎంతో అవసరం. ఎప్పుడైతే ఐరన్ కు సంబంధించిన లోపం ఏర్పడుతుందో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా రోజంతా ఎంతో నీరసంగా ఉంటారు. ఐరన్ శరీరంలో తక్కువగా ఉన్నప్పుడు కళ్ళు, ముఖం ఎంతో నీరసంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ముఖం కాంతివంతంగా అసలు ఉండదు మరియు పసుపు రంగులో మారుతుంది.
ఐరన్ లోపం ఉన్నప్పుడు తలనొప్పిని ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా శాతం మందిలో ఐరన్ లోపం వలన తలనొప్పి మాత్రమే కాకుండా కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కుంటారు. ఐరన్ తక్కువ ఉండడం వలన శ్వాసకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఐరన్ లోపం ఏర్పడుతుందో, కండరాలకు సరైన విధంగా ఆక్సిజన్ అందదు. దీని కారణంగా శ్వాస సమస్యలు మొదలవుతాయి. ఆహారాన్ని సరైన విధంగా తీసుకున్నా కూడా ఐరన్ లోపం వల్ల శరీరం నీరసంగా ఉంటుంది. ఎక్కువ పనులు చేయకపోయినా, బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది.
ఐరన్ లోపంతో బాధపడుతున్నప్పుడు కాళ్లు, చేతులు చల్లగా మారుతాయి. దీంతో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. ఐరన్ లోపం ఉన్నప్పుడు జుట్టు రాలిపోవడం, గోళ్లు పెలుసుగా మారడం వంటి సమస్యలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపం ఏర్పడితే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఈ కారణంగా గుండెలో మంట, చాతిలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఐరన్ శరీరానికి ఎంతో అవసరం. కనుక సరైన ఆహారపు అలవాట్లను పాటించడం, ఐరన్ కు సంబందించిన మెడికేషన్ ను తీసుకోవడం వంటివి చెయ్యాలి.