విశ్రాంత జీవితాన్ని విశాఖలో గడపాలనుకుంటున్నా : తమన్‌

-

విశాఖపట్నం లోని ఆంధ్రా యూనివర్సిటీలో కొత్తగా సౌండ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపధ్యం లో, ఆంధ్రా యూనివర్సిటీ, సెయింట్ లుక్స్ సంస్థ సంయుక్తంగా కలిసి ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ స్టూడియోను ఏర్పాటు చేపట్టడం జరిగింది. ఈ స్టూడియో ప్రారంభోత్సవానికి టాలీవుడ్ అగ్రశ్రేణి సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డితో కలిసి స్టూడియోను ప్రారంభించారు ఎస్ ఎస్ తమన్.

Thaman S: వైజాగ్‌లో సందడి... సంగీతం అంటే ఏంటంటే... | Thaman S launched  studio in Vizag avm

ఈ నేపధ్యం లో తమన్ మాట్లాడుతూ, ఏపీలో ఎంతోమంది సుప్రసిద్ధ కవులు, సంగీతకారులు, నటులు, కళాకారులు జన్మించారని, ఇక్కడి భాష, యాస తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిని ఇస్తుందని అన్నారు ఆయన. వైజాగ్ లో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఇంత భారీ స్టూడియోను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు తమన్. భీమిలిలో ఓ మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో ఏర్పాటు చేయాలన్న ఆలోచన తనకు ఎప్పటినుండో ఉందని తమన్ తెలిపారు. తన విశ్రాంత జీవితాన్ని విశాఖ నగరంలో ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నానని తెలిపారు. తమన్ నిన్న రాత్రి విశాఖలో జరిగిన సీసీఎల్ టోర్నీ ఫైనల్లో తెలుగు వారియర్స్ జట్టు తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news