ప్రస్తుతం తెలంగాణలో గవర్నర్ తమిళి సై, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో తమిళిసై తనను తెలంగాణ ప్రభుత్వం అవమానపరిచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ మంత్రులు కూడా అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గవర్నర్ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తుందని… బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతుందని తెలంగాణ మంత్రులు ఆరోపిస్తున్నారు.
ఇప్పుడు ఈ వివాదంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొ. నాగేశ్వర్ రావు స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత కుమ్ములాటతో ప్రజలకు లాభం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ లు, ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, స్టీల్ ఫ్లాంట్, ట్రైబల్ వర్సిటీ, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, డిఫెన్స్ కారిడార్, పసుపు బోర్డు ఇవ్వాలని మోదీ- అమిత్ షాను అడగాలని గవర్నర్ తమిళిసై కోరాలని అన్నారు. ఈమేరక ఆయన ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.