టార్గెట్ ‘17’: కారు వర్సెస్ కమలం…ఎత్తుకు పై ఎత్తులు..!

-

తెలంగాణ వచ్చి ఎనిమిదేళ్లు దాటేసింది..కానీ ఈ ఎనిమిదేళ్లుగా అటు అధికార టీఆర్ఎస్ పార్టీ అయినా సరే..ప్రతిపక్ష పార్టీలైన సరే తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. నిజాం నిరంకుశ పాల‌న నుంచి తెలంగాణ‌కు విముక్తి క‌లిగిన సంద‌ర్భాన్ని, అందుకు కృషి చేసిన సాయుధ పోరాట అమరవీరులను స్మరించుకుంటూ ప్రతీ ఏటా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచ‌నదినంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్…ఎప్పుడు కూడా అధికారికంగా జరపలేదు. అధికారంలో ఎనిమిదేళ్లు ఉన్నా సరే..దీన్ని పట్టించుకోలేదు. కానీ బీజేపీ మాత్రం ఎప్పటికప్పుడు విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలని డిమాండ్ చేయడమే తప్ప..కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా జరపలేదు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ తీవ్ర స్థాయిలో నడుస్తున్న క్రమంలో…కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి సిద్ధమైంది.

కేంద్ర మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా కార్యక్రమం జరగనుంది. ఇక బీజేపీకి పోటీగా కేసీఆర్ సర్కార్ కూడా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించనుంది. అదే రోజు ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. అటు కాంగ్రెస్ సైతం ఏడాది పాటు విమోచన దినోత్సవ కార్యక్రమాలని నిర్వహించడానికి సిద్ధమైంది.

అయితే మరో మూడు రోజుల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్, బీజేపీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. ఈ క్రామంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మెట్రో పిల్లర్లు, సిటీ బస్ స్టాప్ షెల్టర్లు, హోర్డింగులని టీఆర్ఎస్ బ్యానర్లు కట్టడానికి బుక్ చేసేసుకుంది. అలాగే ఎన్టీఆర్ స్టేడియంకు జనాలని తరలించడానికి ఆర్టీసీ బస్సులని బుక్ చేసింది. దీంతో బీజేపీకి చిన్నపాటి షాక్ ఇచ్చింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంటర్ అయ్యి..కొన్ని బస్సులని మాట్లాడారు. కానీ ఫ్లెక్సీలు కట్టడానికి బీజేపీకి పెద్ద ఛాన్స్ దక్కేలా లేదు. మొత్తానికి 17న వార్ గట్టిగా జరిగేలా ఉంది. ఆ రోజు కేసీఆర్-అమిత్ షాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news