ఎయిర్ ఇండియాపై కేంద్రం అధికార ప్రకటన.. 68 ఏళ్ల తరువాత టాటాల చేతికి

-

ఇక ఎయిర్ ఇండియా టాటాల చేతికి వెళ్లనుంది. గత కొన్ని రోజులుగా టాటా చేతికి ఎయిర్ ఇండియా టాటాల చేతికి వెళ్లిందనే వార్తలు వచ్చినా.. కేంద్రం అధికార ప్రకటన చేయలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటా సన్స్ చేతికి వెళ్లినట్లు అధికార ప్రకటన చేసింది. 18 వేల కోట్లకు టాటా గ్రూప్ బిడ్ వేసి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకుంది. దాదాపుగా 67 ఏళ్ల తర్వాత టాటాల చేతికి ఎయిర్ ఇండియా వెళ్లనుంది. టాటా సన్స్ గ్రూప్, స్పైస్ జెట్ రెండు ఓపెన్ బిడ్ల వేయగా అత్యధికంగా కోట్ చేసిన టాటా సన్స్ గ్రూప్ ఎయిర్ ఇండియాను దక్కించుకుంది. 1932 సంవత్సరంలోె జేఆర్డీ టాటా టాటా ఎయిర్ లైన్స్ ను స్థాపించారు. కరాచీ నుంచి ముంబైకి సర్వీసులు నడిపారు. స్వాతంత్య్రం అనంతరం 1953లో ఎయిర్ ఇండియా జాతీయం చేశారు. 2007 నుంచి ఎయిర్ ఇండియా నష్టాల్లో నడుస్తోంది. గతంలో కూడా ఎయిర్ ఇండియాను అమ్మే ప్రయత్నం చేశారు. తాజా డీల్ తరువాత ప్రభుత్వం 100 శాతం పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు అయింది. దేశ వ్యాప్తంగా 50కి పైగా నగరాలకు సర్వీసులను నడుపుతోంది. మొత్తం 127 విమానాలతో ప్రపంచంలో పెద్ద ఎయిర్ లైన్స్ సంస్థల్లో ఒకటిగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version