ఫ్యాన్ కోటల్లో సైకిల్ బోణి?

-

రాష్ట్రంలో అధికార వైసీపీ కంచుకోటలు చాలా ఉన్నాయి.. రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు ఎలా ఉన్నా సరే.. ఆ కంచుకోటల్లో వైసీపీ విజయాన్ని అడ్డుకోవడం కష్టమనే చెప్పాలి.. గత రెండు ఎన్నికల్లో అదే జరిగింది..చాలా చోట్ల వైసీపీ విజయానికి టీడీపీ బ్రేక్ వేయలేకపోయింది.. ఇక 2019 ఎన్నికల్లో అయితే వైసీపీ వేవ్ ముందు సైకిల్ చిత్తు అయింది. మరి 2019 ఎన్నికల్లో ఉన్న పరిస్తితి.. 2024 ఎన్నికల్లో కూడా ఉంటుందా? అంటే ఏమో చెప్పలేని పరిస్తితి ఉంది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మార్పు కనిపిస్తోంది..పూర్తిగా వైసీపీకి బలం కనిపించడం లేదు.. పైగా ప్రతిపక్ష టీడీపీ కూడా పుంజుకున్నట్లు తెలుస్తోంది.

ysrcpandtdp

అటు జనసేన గాని టీడీపీతో కలిస్తే వైసీపీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలని టీడీపీ బద్దలుగొట్టే అవకాశం కూడా ఉంది..ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఈ సారి టీడీపీ బోణి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది.. ఈ జిల్లాల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాలేదు.

అయితే ఈ సారి ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ బోణి కొట్టడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చే పరిస్తితి కనిపిస్తోంది. వైసీపీతో పోటీగా సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది.. అలాగే జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ బోణి కొట్టేలా ఉంది.. వైసీపీకి పోటీ ఇవ్వలేకపోయిన కనీసం ఒకటి, రెండు సీట్లు అయిన గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.

అటు కర్నూలులో కూడా వైసీపీకి మెజారిటీ సీట్లు వచ్చిన సరే.. టీడీపీ కనీసం నాలుగైదు సీట్లు గెలుచుకునే ఛాన్స్ కనిపిస్తోంది.ఇక నెల్లూరులో వైసీపీకి లీడ్ వచ్చిన సరే.. టీడీపీ బోణి కొట్టి రెండు, మూడు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఫ్యాన్ కోటల్లో సైకిల్ బోణి చేసేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version