కృష్ణాలో వైసీపీ-టీడీపీ అభ్యర్ధులు ఫిక్స్?

-

ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో తెలియదు గాని…రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నట్లు రాజకీయ యుద్ధం చేస్తున్నాయి. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య వార్ ఓ రేంజ్ లో నడుస్తోంది. రెండు పార్టీలు అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. మరొకసారి అధికారంలోకి రావాలని వైసీపీ…ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని టీడీపీ చూస్తుంది. ఈ క్రమంలోనే ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్ధిని నిలబెట్టడమే లక్ష్యంగా వెళుతున్నాయి.

అసలు ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో క్లారిటీ లేకుండానే..అప్పుడే నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ప్రకటించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అభ్యర్ధులని ప్రకటించేశారు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో సైతం టీడీపీ-వైసీపీ అభ్యర్ధులు దాదాపు ఖరారైపోయినట్లే కనిపిస్తోంది. గుడివాడలో వైసీపీ నుంచి కొడాలి నాని పోటీ ఖాయం…టీడీపీ నుంచి రావి వెంకటేశ్వరరావు బరిలో ఉంటారు..చివరి నిమిషంలో అభ్యర్ధిని మార్చే ఛాన్స్ కూడా ఉంది.

మచిలీపట్నంలో వైసీపీ నుంచి పేర్ని నాని వారసుడు పేర్ని కృష్ణమూర్తి…టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర బరిలో ఉండనున్నారు. పెడనలో జోగి రమేష్(వైసీపీ)-కాగిత కృష్ణప్రసాద్(టీడీపీ) పోటీ చేస్తారు. పెనమలూరులో పార్థసారథి(వైసీపీ)-బోడే ప్రసాద్(టీడీపీ), పామర్రులో కైలా అనిల్ కుమార్(వైసీపీ)-వర్ల కుమార్ రాజా(టీడీపీ), అవనిగడ్డలో సింహాద్రి రమేష్(వైసీపీ)- మండలి బుద్ధప్రసాద్ వారసుడు(టీడీపీ),  గన్నవరంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీ పోటీ చేయడం ఖాయమే. టీడీపీ తరుపున బచ్చుల అర్జునుడు పోటీ చేస్తారా? లేక వేరే నేత పోటీ చేస్తారో క్లారిటీ లేదు.

అటు కైకలూరులో వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావుకు మరొకసారి పోటీచేసే ఛాన్స్ ఉండదని తెలుస్తోంది. ఈయన ప్లేస్ లో వేరే నేత పోటీ దిగే ఛాన్స్ ఉంది. ఇక పొత్తు ఉంటే కైకలూరు సీటుని జనసేనకు ఇవ్వాలని టీడీపీ చూస్తుంది…లేదంటే టీడీపీ తరుపున ఎవరు బరిలో దిగుతారో క్లారిటీ లేదు. మొత్తానికి చెప్పాలంటే కృష్ణా జిల్లాలో దాదాపు వైసీపీ-టీడీపీ అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news