సీఎం యోగీ ఆదిత్య నాథ్ పోటీపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ.. గోరఖ్ పూర్ నుంచే బరిలోకి దిగనున్న యోగీ

ఉత్తర్ ప్రదేశ్లో మరి కొన్ని రోజుల్లో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 7 దశల్లో యూపీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పింది. ఫిబ్రవరి 10న తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించనున్నాయి.

ఇదిలా ఉంటే అందరి కన్నా ముఖ్యంగా యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పోటీ చేయబోయే స్థానంపై అందరి చూపు ఉంది. ఇటీవల అయోధ్య నుంచి యోగీ పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే తాజాగా బీజేపీ పార్టీ యోగి పోటీ చేయబోయే స్థానంపై క్లారిటీ ఇచ్చాయి. గోరఖ్ పూర్ నుంచే యోగీ ఆదిత్య నాథ్ పోటీ చేస్తారని బీజేపీ వెల్లడించింది. మరో  కీలక నేత డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఎన్నికల్లో ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని సిరతు నుంచి పోటీ చేయనున్నారు.

ముందుగా అయోధ్య నియోజకవర్గం నుంచి సీఎం యోగీ పోటీచేస్తారని అనుకున్నారంత. ఇందుకు సంబంధించి పలు రూమర్స్ చెక్కర్లు కొట్టాయి. తాజాగా వీటన్నింటికి బీజేపీ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది.