ఘ‌న విజ‌యం సాధించి రికార్డుల‌ను కొల్ల‌గొట్టిన టీమిండియా

-

దుబాయ్ వేదిక గా టీ ట్వంటి ప్ర‌పంచ్ క‌ప్ లో భాగంగా టీమిండియా స్కాట్లాండ్ ను ఢీ కొట్టింది. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ టీమిండియా పై ఎక్క‌డా కూడా అధి ప‌త్యం చేలాయించ‌లేదు. క‌నీస పోటీ కూడా ఇవ్వ లేక పోయింది. దీంతో టీమిండియా భారీ విక్ట‌రీ ని త‌న ఖాత లో వెసుకుంది. ఈ టోర్న మెంట్ లో మొద‌టి సారి టాస్ నెగ్గిన కోహ్లి సేనా.. స్కాట్లాండ్ ను మొద‌ట బ్యాటింగ్ చేయ‌డానికి ఆహ్వ‌నించింది.

స్కాట్లాండ్ బ్యాటింగ్ లైన్ అప్ లో ఎ ఒక్క బ్యాట‌ర్ కూడా టీమిండియా బౌల‌ర్ల దాటికి నిల‌వ‌ద లేక పోయారు. ఓపెన‌ర్ మున్సే ఒక్క‌రే 24(19) చేశాడు. దీంతో 85 ప‌రుగుల కే స్కాట్లాండ్ తొక‌ముడిచింది. అయితే 86 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం తో బ‌రి లోకి దిగిన టీమిండియా ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, కెఎల్ రాహుల్ శుభారంబాన్ని ఇచ్చారు. రోహిత్ శ‌ర్మ 30(16) చేశాడు. అలాగే కెఎల్ రాహుల్ 50 (19) ఆడి స్కోరు బోర్డు ను ప‌రుగులు పెట్టించాడు. వీరి దాటి కి ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌రికి 82 ప‌రుగులను చేసింది. అయితే ఈ ఇద్ద‌రు అవుట్ కావ‌డం తో కోహ్లి 2(2) , సూర్య కుమార్ యాద‌వ్ 6(2) ఇన్నింగ్స్ ను పూర్తి చేశారు.

 

అయితే ఈ విజయం తో టీమిండియా ఖాత లో చాలా రికార్డు లు న‌మోదు అయ్యాయి. ఎక్కువ బాల్స్ మిగిలి ఉండ‌గా విజ‌యం సాధించిన మూడో జట్టు గా టీమిండియా రికార్డు సృష్టించింది. అలాగే టీమిండియా చ‌రిత్ర లో కూడా ఎక్కువ బంతులు మిగిలి ఉండ‌గా గెలుపు ను అందుకున్న జ‌ట్టు గా నిలిచింది. భార‌త్ టీ ట్వంటి చ‌రిత్ర లో ప‌వ‌ర్ ప్లే లో ఎక్కువ ప‌రుగులు చేసిన మ్యాచ్ గా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ప‌వ‌ర్ ప్లే అయినా 6 ఓవ‌ర్ల‌లో 82 ప‌రుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version