ఏపీనే రూ. 12 వేల కోట్లు ఇవ్వాలి – తెలంగాణ సర్కార్ ప్రకటన

-

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర సర్కార్‌ కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యుత్ బకాయిల చెల్లింపు పై తాజాగా కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి బకాయిలు ఉన్న నిధులు వెంటనే చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్. అయితే.. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహించారు.

ఇది ముముమ్మాటికీ దేశద్రోహపూరిత చర్యేనని.. తెలంగాణా ప్రభుత్వంపై కేంద్రం కక్ష్య పూరితంగా వ్యవరిస్తోందని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలి అన్నది కేంద్రం కుట్ర అని ఆగ్రహించారు. కృష్ణా ,గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం అదే ధోరణి అవలంబిస్తుందని.. అపెక్స్ మీటింగ్ పెట్టాలి అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ణప్తిని పట్టించుకోలేదని ఆగ్రహించారు.

తెలంగాణ ఇచ్చుడు కాదని.. ఏపీ నుండి రావాల్సిన రూ.12941 కోట్ల బకాయిల విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టిలో ఉందని మరో సంచలన ప్రకటన చేశారు జగదీశ్వర్‌ రెడ్డి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం తీసుకుందని.. నెల రోజుల్లో చెల్లించాలి అనడం ముమ్మాటికీ దుర్మార్గమేనని మండిపడ్డారు. జాతీయ ప్రభుత్వంగా చెయ్యల్సింది కాదు… తెలంగాణాను చీకట్లోకి పంపేందుకే ఈ నిర్ణయాలు అని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news