బ్రేకింగ్‌ : ముగిసిన కేబినెట్‌ మీటింగ్‌.. బీసీ సంక్షేమ శాఖలో 2591 నూతన ఉద్యోగాలు

-

వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేందుకు., వీలుగా కింది స్థాయి డి.ఈ.ఈ నుంచి పై స్థాయి సి.ఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా… విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డి.ఈ.ఈ కి వొక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు)., ఈ.ఈ కి 25 లక్షల వరకు (ఏడాదికి 1.5 కోట్లు)., ఎస్. ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు) ., సీ.ఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందుకోసం..ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది. ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

CM KCR releases video of agents offering Rs 50 cr to MLAs, asks CJI to act  against BJP | The News Minute

ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయం. రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశం. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు. రోడ్లు భవనాల శాఖ లో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది.

ఇందులో… కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు., 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు., 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు., 102 డి.ఈ.ఈ పోస్టులు., 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు., 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్ , నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి.

ఆర్ అండ్ బి శాఖ లోని.., రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో… 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను., 10 సర్కిల్ కార్యాలయాలను., 13 డివిజన్ కార్యాలయాలను., 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది. ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతు ( పీరియాడిక్ రెన్యువల్స్) ల కోసం, కూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

కింది స్థాయి డి.ఈ.ఈ నుంచి పై స్థాయి సి.ఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది.

డి.ఈ.ఈ కి వొక్క పనికి రూ. 2 లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు)., ఈ.ఈ కి 25 లక్షల వరకు (ఏడాదికి 1.5 కోట్లు)., ఎస్. ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు) ., సీ.ఈ పరిధిలో రూ. 1 కోటి వరకు (సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఏడాదికి రూ. 129 కోట్లు ఆర్ అండ్ బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది.

బీసీ సంక్షేమ శాఖలో.. మహాత్మా జ్యోతి బా ఫూలే బి.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం, 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news