పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వెల్లంపల్లి

-

వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైజాగ్ లో చాల ఘనంగా జరిగిందని, భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పారిశ్రామికవేత్తలు తమ రాష్ట్రంలో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని, రాష్ట్రంలో ప్రత్యక్షంగా 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు వెల్లంపల్లి. గతంలో ఇంతకుముందు చంద్రబాబు ఇంటి ముందు గూర్ఖాలు సూట్లు తొడిగి ఎంవోయూలు చేసుకునేవారని హేళన చేశారు. కానీ, సీఎం జగన్ ఏపీకి అంబానీ, అదానీ, జీఎంఆర్ వంటి పెద్ద-పెద్ద పారిశ్రామికవేత్తలను వ్యక్తపరిచారు.

విశాఖ సదస్సు విజయవంతం కావడం పట్ల జాతీయ మీడియా మొత్తం జగన్ ను కొనియాడిందని, కానీ పచ్చమీడియా మాత్రం
తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు పవన్ కల్యాణ్ కు కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు,లోకేశ్, పవన్ కల్యాణ్ ల సంగతి తేలుస్తామని పేర్కొన్నారు వెల్లంపల్లి. గుంపులుగా అందరూ కలిసి వచ్చినా తమను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు వెల్లంపల్లి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news