గీత కార్మికులందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతున్నదని, ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు, కులవృత్తులను కాపాడుకునేందుకు నిత్యం కృషిచేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు గారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్ధిపేటలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మితమవుతున్నదని రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందని మంత్రి శ్రీ హరీశ్ గారు వెల్లడించారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ పరిధిలోని 529 మంది గీతా కార్మికులకు గుర్తింపు కార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక గౌడ కులస్తులకు వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు, సొసైటీ పునరుద్ధరణ, కొత్త లైసెన్సులు అందిస్తున్నట్లు, సర్కారు అండగా ఉంటుందని మంత్రి చెప్పారు.గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గీతా కార్మికులకు లైసెన్సులు దొరికేవి కావు. పైగా సొసైటీలు రద్దు చేసేవారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో నష్టపోతే సాయం చేసిన విషయాలను గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తెచ్చిందని తెలుపుతూ గీతా కార్మికుల లైసెన్సులు పదేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేస్తున్నట్లు, తెలంగాణ ఏర్పాటు అయ్యాక 8 ఏళ్లలో గీతా కార్మికులపై ఒక్కకేసు, వేధింపులు లేకుండా ఆదుకున్నామని, సేవలు అందించామని మంత్రి వివరించారు.గీతా కార్మికుడు మృతి చెందితే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నట్లు, 15 శాతం వైన్ షాపులలో రిజర్వేషన్లు తెచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని, బడ్జెట్లో గౌడ కులస్తులకు వంద కోట్లు కేటాయింపు చేసినట్లుగా ధీమాతో చెప్పారు.
కేంద్రం మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని కక్ష గట్టి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక, ఈర్ష్యతో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.మత్స్య కార్మికులకు ఉన్న తరహాలో గీతా కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ తేనున్నారని మంత్రి వెల్లడించారు.50 ఏళ్లు నిండిన గీతా కార్మికుడికి ఫించన్లు, 5 లక్షల భీమా సౌకర్యం, టీఎఫ్టీలో కొత్త కార్డులను టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నట్లు, గతంలో కాంగ్రెస్ అంటే మామూళ్లు ఉండేవనీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక 150 టీఎఫ్టీ లైసెన్సులు ఇవ్వడంతో పాటుగా, లైసెన్స్ ఇచ్చి, కేసులు రద్దు చేసినట్లు చెప్పారు.