అకాల వర్షం.. రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..

-

దెబ్బ మీద దెబ్బ, వరుస దెబ్బలతో రైతాంగం అతలాకుతలమైతుంది. చిన్న, సన్నకారు రైతులు గుండె పగిలి గొల్లుమంటున్నారు. రైతులు ఒక్క ఏడాది కాలంలోనే మూడు సార్లు కురిసిన అకాల వ‌ర్షాల‌తో పంట‌లు న‌ష్టం పోవాల్సి వ‌చ్చింద‌ని క‌న్నీరు మున్నీర‌వుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంటలు, మామిడి తోటలు, పండ్లతోటలు, కూరగాయలు రాళ్లవానకు నేలకొరిగాయ‌ని, చెడగొట్టువానలు రైతులను తీవ్రమైన కష్టాల పాలు చేశాయ‌ని వాపోయారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. జనగామ జిల్లాలో శనివారం వడగళ్ల వానతో పంటలు దెబ్బతినగా ఆదివారం మంత్రి క్షేత్రస్థాయి పంటలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ శివ లింగ‌య్య‌, అడిష‌న‌ల్ క‌లెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టానికి సంబంధించి విషయాలపై ఆరా తీశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, కొద్ది రోజుల కిందట ప్రకృతి బీభ‌త్సానికి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. పరిహారంపై గతంలో ఎక్కడా ఎన్నడూ ఇవ్వనంత ఎకరాకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు.

 

ఈ నష్టాన్ని రైతులు మరిచిపోక ముందే మరోసారి వడగళ్ల, అకాల వర్షాలు కురవడం దురదృష్టకమన్నారు. ప్రకృతి ప్రకోపానికి తప్పుకోవడం తప్ప చేసేది ఏమీ లేదన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముందస్తుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. దాంతో కొంత వరకు నష్టాలు తగ్గాయన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version