వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

-

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం పై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రెటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టు కు వెల్లడించారు. ఇది చట్ట విరుద్ధమన్న వేదుల వెంకటరమణ..సెక్షన్ 10,(2) ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పౌరసత్వం రద్దు చేసే అధికారాలున్నాయని తెలిపారు.

కానీ పిటీషనర్ కు అందులో ఉన్న ఏ అంశాలు కూడా వర్తించవని.. చెన్నామనేని టెర్రరిస్ట్, సంఘ విద్రోహ శక్తి కాదని సెక్షన్ 10(2) వర్తించదని కోర్టు కు చెప్పారు వేదుల వెంకటరమణ. చెన్నమనేని సెక్షన్ 5 కింద భారత పౌరసత్వం కు దరఖాస్తు చేసుకున్నారని.. దరఖాస్తులో ఒక వేళా తప్పుడు సమాచారం ఇస్తే పౌరసత్వం ను రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉందన్నారు వేదుల వెంకటరమణ.

(OCI)ఓవర్ సిస్ ఇండియన్ సిటిజన్ కు భారత దేశంలో ఎమ్మెల్యే, ఎంపీ గా ఫొటో చేసే అధికారం ఉంటుందా ? అని ప్రశించింది హైకోర్టు. OCI మీద ఎలాంటి పోటీ చేసే అధికారం లేదని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన వేదుల వెంకటరమణ.. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా చెన్నమనేని గెలిచారని కోర్టుకు తెలిపారు. నాలుగు సార్లు దురదృష్టవశాత్తు జర్మనీ పాస్పోర్ట్ మీద గెలిచారని ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు పేర్కొన్నారు. ఇక తదుపరి విచారణను వచ్చే బుధవారం కు వాయిదా వేసింది హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news