సోమవారం సెలవు ఇవ్వాలని CS కు విజ్ఞప్తి

-

మాములుగా ప్రతి సంవత్సరం కొన్ని పండుగలు మాత్రం పబ్లిక్ హాలిడే (ఆదివారం) రోజున వస్తూ చాలా మందికి నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆదివారం సెలవు దినమని తెలిసిందే. అదే విధంగా ఇంకో అయిదు రోజుల్లో రానున్న దీపావళి పండుగ సైతం ఆదివారమే (నవంబర్ 12) రావడం జరిగింది. ఇక పండుగ రోజు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కానీ ఈ సెలవును మార్చాలంటూ తెలంగాణ ఎన్జీఓ ప్రతినిధులు ఒక వినతిని ప్రభుత్వానికి అందచేశారు. దీపావళి కి ప్రభుత్వం ఇస్తున్న సెలవును ఆదివారం నుంఢి సోమవారానికి (నవంబర్ 13) కు మార్చాలంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి తెలియచేయడం జరిగింది. ఈ వినతితో పాటుగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న డీఏ ను కూడా విడుదల చేయాలనీ కోరారు ఎన్జీఓ ప్రతినిధులు.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి సెలవును ఆదివారం కాకుండా సోమవారానికి ప్రకటించడంతో ఈ కోరిక తెలంగాణలోనూ కలిగిందన్నది కాదనలేని విషయం. మరి ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version