వరిధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. ఎఫ్ సీ ఐ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని హరీష్ రావు కోరారు. సోమవారం సిద్ధిపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తూ కేంద్రం తీరుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తీరు వల్ల నష్టపోతున్నారన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను ఆదుకుంటుందని వెల్లడించాడు. వర్షాకాలంలో రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు కేంద్రం సహకరించడం లేదు- హరీష్ రావు
-