సాగుచట్టాలను రద్దు చేాయాలని రైతులు చేస్తున్న ఆందోళనలకు నేటితో ఏడాది పూర్తి కావడంతో నేడు జాతీయ రైతు సంఘాలు దేశబంద్ కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు, పలు కార్మికసంఘాలతో పాటు ఏపీ, ఢిల్లీ వంటి రాష్ట్రాలు బంద్ కు మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం బంద్ కు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ విపక్షాలు మాత్రం బంద్ కు మద్దతుగా నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, జనసమితి పార్టీలు మద్దతుగా బరిలోకి దిగనున్నాయి. సాగుచట్టాల రద్దు, పెరుగుతున్న పెట్రోల్ డిజిల్ ధరలు, విద్యుత్ సరఫరా చట్టాలకు వంటి 11 డిమాండ్లతో విపక్షాలు బంద్ మద్దతు తెలిపాయి. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఉప్పల్ డిపో ముందు నిరసన తెలియజేయనున్నారు. కోఠి నుంచి నారాయణ గూడ వరకు లెప్ట్ పార్టీలు ర్యాలీ నిర్వహించనుంది. హయత్ నగర్లో కోదండరామ్, చాడ ఆందోళనలు చేయనున్నారు. జాతీయ రహదారులపై ధర్నాలతో నిరసనలు తెలియజేయనున్నారు.
తెలంగాణ బంద్ కు విపక్షాల మద్దతు.. నేడు నిరసనలు ధర్నాలు
-