కుమారి అంటీకి ఒక న్యాయం… సామాన్యులకు మరో న్యాయమా? – దానం నాగేందర్

-

కుమారి అంటీకి ఒక న్యాయం… సామాన్యులకు మరో న్యాయమా? అంటూ హైడ్రా కూల్చివేతల పట్ల రేవంత్ సర్కార్ పై డోస్ పెంచారు దానం నాగేందర్. హైదరాబాద్ లో కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షం వ్యవహరిస్తున్నారు అని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

kumari

పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదన్నారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారాణి చెప్పారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. రోజూవారి వ్యాపారాలు చేసుకునే పేదలను అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు.ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వివరించారు.

కుమారి అంటీకి ఒక న్యాయం… సామాన్యులకు మరో న్యాయమా?

హైడ్రా కూల్చివేతల పట్ల రేవంత్ సర్కార్ పై డోస్ పెంచిన దానం నాగేందర్#DanamNagendar #RevanthReddy #KumariAunty #Hydraa @revanth_anumula pic.twitter.com/h27kzQYSZH

— Pulse News (@PulseNewsTelugu) January 23, 2025

Read more RELATED
Recommended to you

Exit mobile version