బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి – సునీతారావు

-

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలను కించ పరుస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ, బోనాలు, హారతులు ఇస్తే డబ్బులు ఇస్తామని దండోరాలు వేయిస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు మహిళలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారన్నారు.

మహిళలను అగౌరవ పరిస్తే వచ్చే ఎన్నికల్లో మీ సీట్లు సునామీలో కొట్టుకు పోతాయన్నారు సునీతారావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మహిళ రిజర్వేషన్ పై మాట్లాడే కవిత.. మహిళలను, బతుకమ్మను అవమాన పరుస్తున్న సొంత ఎమ్మెల్యేపై ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. మర్రి జనార్ధన్ రెడ్డి మహిళలకు క్షమాపనలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version