సచివాలయంలో ఎండిపోయిన మహాగని మొక్క.. ఫలించని కేసీఆర్ సెంటిమెంట్..!

-

గత ఎన్నికల సందర్భంగా రాజశ్యామల యాగాన్ని నిర్వహించి ఫలితాలు పొందిన బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈసారి ఎన్నికలప్పుడూ అదే యాగాన్ని ఎర్రవల్లిలోని తన సొంత ఫామ్ హౌస్ లో నిర్వహించారు. గత నెల ఒకటి నుంచి మూడు రోజుల పాటు జరిగిన ఈ యాగంలో పాల్గొంటూనే ప్రజా ఆశీర్వాద సభలకు సైతం హాజరయ్యారు. ఆ తర్వాత తన విశ్వాసానికి అనుగుణంగా మహాగని మొక్కను అడవి నుంచి తీసుకొచ్చి కొత్త సచివాలయం ప్రాంగణంలో నటించారు. ప్రతీరోజు దాని సంరక్షణ కోసం అటవీ, ఉద్యానవన శాఖల అధికారులు చొరవ తీసుకున్నారు. ఏపుగా పెరిగేందుకు వీలుగా అవసరమైన ఆర్గానిక్ ఎరువులతో పాటు పురుగు పుట్టకుండా మందుల్ని సైతం వాడారు.

ఆ మొక్కకు ఔషధ విలువల సంగతి ఎలా ఉన్నా ఆధ్యాత్మికంగా శుభం జరుగుతుందని భావించిన కేసీఆర్ దీన్ని సచివాలయంలో నాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ మొక్క ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేల స్వభావమో, మరే కారణమో అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బతకలేదు. ప్రచారం ముగుస్తున్న సమయంలో అది బతికే అవకాశం లేదని తేలిపోయింది. ఇక బతికే ఛాన్స్ లేదని అర్థమైంది. ఏదో అపశకునమేననే అభిప్రాయం వ్యక్తం అయింది. ఆ ఎఫెక్ట్ పోలింగ్ రోజున కనిపించిందనే కామెంట్లు వినిపించాయి. మొక్క ఎండిపోవడం ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావనే అపశకునానికి సంకేతమన్న మాటలు వచ్చాయి. ఆ నమ్మకాలకు బలం చేకూరే తరహాలో పలు సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాలూ వెలువడ్డాయి. అటు యాగం ద్వారా, ఇటు మొక్క నాటడం ద్వారాను ఫలితాలు రాకపోవచ్చనే స్పష్టత ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version