కరీంనగర్ జిల్లాలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. కరీంనగర్ జిల్లా మంకమ్మతోటలోని నర్సన్న అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీ కొండ చిలువ చొరబడింది. ఫ్రిడ్జ్‌పైకి ఎక్కి వస్తువులను కింద పడేయడంతో ఇంట్లోవాళ్లు.. భయపడి బయటికి పరుగులు తీశారు.
పోలీసులకు సమాచారం అందించడంతో, కొండచిలువను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు స్నేక్ క్యాచర్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన జనాలు షాక్ అవుతున్నారు.