నేడు సీఎం కేసీఆర్ కొండగట్టు పర్యటన కొనసాగుతుంది. దాదాపు 25 ఏళ్ల తర్వాత సీఎం కేసీఆర్ కొండగట్టుకు రావడంతో ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. 1998లో కేసీఆర్ కొండగట్టు ఆలయానికి వెళ్ళగా.. తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టుకి వచ్చారు. అయితే గత డిసెంబర్ 7న జగిత్యాలకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మోతేలో జరిగిన భారీ బహిరంగ సభ వేదికగా కొండగట్టుకు 1000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నేడు కొండగట్టు ఆలయానికి మరో 500 కోట్లను కేటాయించనున్నట్లు కేసిఆర్ ప్రకటించారు. దేశంలోనే ప్రముఖ ఆంజనేయ క్షేత్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మొత్తంగా 600 కోట్లతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇక ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.