వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలిపారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వెల్లడించారు. బీజేపీలోకి రావాలంటే పదవులకు రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. 30 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పుడు హస్తం పార్టీని జాకీ పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
బీజేపీలోకి రావాలంటే బీఆర్ఎస్ నాయకులు పదవులకు రాజీనామా చేయాల్సిందే. కాంగ్రెస్ను జాకి పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ధరణి బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు. ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబమే. కేసీఆర్ వేసిన శిలాఫలాకాలతో ఏకంగా ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొచ్చు. ప్రజల కోసం ఉద్యమిస్తున్న బీజేపీ నేతలపై కేసులు పెడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే అవినీతిపరుల అంతు చూస్తాం.” – బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు