ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతా – బండి సంజయ్

ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. పాదయాత్ర చేసి తీరుతానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాలుగు విడతలు ప్రశాంతంగా యాత్ర చేసామని..అన్ని యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చిందని తెలిపారు. ఐదో విడత రేపు ఉదయం 12.30 నిమిషాలకు ప్రారంభించాలను కున్నామని చెప్పారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు బాబురావు అన్ని పర్మిషన్ లు కు అప్లయ్ చేశారని… రోడ్ మ్యాప్ బహిరంగ సభ ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయని వెల్లడించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెర్నాండెస్ పర్యటన కు అన్ని ఏర్పాట్లులో పోలీసులు పాల్గొన్నారని.. బైంసా వెళ్తుండగా
కోరుట్ల దగ్గర పోలీసులు నన్ను ఆపారని వెల్లడించారు.

పోలీసులు పహారా చేస్తూ బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు..పర్మిషన్ అప్లై చేసినప్పుడు బైంసా సెన్సిటివ్ ప్లేస్ అని ముఖ్యమంత్రి కి గుర్తుకు రాలేదా అని నిలదీశారు. వారం రోజులుగా అక్కడ ఏర్పాట్లు జరుగుతుంటే అప్పుడు తెలియలేదా ? బైంసా తెలంగాణ లో ఒక భాగంని తెలుసుకో ? అని పేర్కొన్నారు. బైంసాని కాపాడని ముఖ్యమంత్రి ఏమనాలని నిలదీశారు బండి సంజయ్.