ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ సంగ్రామ యాత్ర..షెడ్యూల్ ఇదే

-

బండి సంజయ్ సంగ్రామ యాత్ర కి భారీ స్పందన వస్తుందని.. యాత్ర ప్రభావం క్షేత్ర స్థాయిలో ఉందని చెప్పారు సంజయ్ సంగ్రామ యాత్ర ఇంఛార్జి మనోహర్ రెడ్డి. ఏడాదిలో పది పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ బిజెపి అని.. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడత యడాద్రి నుండి ఆగస్ట్ 2 న ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంట్ లో 6 అసెంబ్లీ, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉంటుందనన్నారు.

23 రోజుల పాటు పాదయాత్ర ఉంటుందని.. 6 వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా యాత్రకు విరామం ఉంటుందని చెప్పారు. 328 కిలోమీటర్ లు యాత్ర ఉంటుందని.. ఆగస్ట్ 26 న భద్రకాళి అమ్మవారి దగ్గర ముగుస్తుందని చెప్పారు. యాత్ర వెళ్ళే రూట్ లోకి అసెంబ్లీ నియోజక వర్గాల కి పార్టీ సీనియర్ నేతలు సమన్వయ కర్తలు గా నియమించామని.. భారీ బహిరంగ సభ తో యాత్ర ప్రారంభం అయ్యి భారీ బహిరంగ సభతో ముగుస్తుందని వెల్లడించారు. 125 గ్రామాల గుండా యాత్ర సాగుతుంది…యాత్ర సందర్భంగా పార్టీ లో చేరికలు ఉంటాయని ప్రకటన చేశారు సంజయ్ సంగ్రామ యాత్ర ఇంఛార్జి మనోహర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news