BRS అంటే ఇక కేసీఆర్‌ కు VRS తప్పదు – బండి సంజయ్‌

-

BRS అంటే ఇక కేసీఆర్‌ కు VRS తప్పదని ఎద్దేవా చేశారు తెలం గాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌. కేసీఆర్ టైం పాస్ రాజకీయాలు చేస్తున్నాడని.. ప్రజాస్వామ్యం లో ఎవరైన రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని పేర్కొన్నారు. ముందు తెలంగాణకు ఏమి చేశాడో కేసీఆర్ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మోదీ ఎనిమిదెళ్ళ పాలనపై.. కేసీఆర్ ఎనిమిదేళ్ళ పాలనపై చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు బండి సంజయ్‌. కుటుంబ, అవినీతి పార్టీలకు దేశంలో అంతమైపోతున్నాయని.. బీఆర్ఎస్ కెసిఆర్ కి వి ఆర్ ఎస్ అంటూ చురకలు అంటించారు.

దేశ ప్రజలు మోదీ మోదీ అంటుంటే.. కేసీఆర్ ను రోగి రోగి అంటున్నారని.. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశాడని ఫైర్‌ అయ్యారు. ప్రపంచంలో భారత్ ను మోదీ అగ్రస్థానంలో నిలిపారని.. ఎన్నికల హామీలను కేసీఆర్ తుంగలో తొక్కాడని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news