మహాత్మా గాంధీని హత్య చేసింది బీజేపీ పార్టీనే – భట్టి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పెద్దతండ వద్ద రెండవ రోజు ఆజాద్ కా గౌరవ పాదయాత్రలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సంచలన కామెంట్స్ చేశారు. మహాత్మా గాంధీని హత్య చేసింది బీజేపీ పార్టీనేనని భట్టి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎందరో మహానుభావుల పోరాటం తో దేశానికి స్వాతంత్య్రం తెచ్చి ఆర్థిక వ్యవస్థ బలపర్చింది కాంగ్రెస్ పార్టీనేనని.. ప్రాజెక్టును తీసుకవచ్చి సస్యశ్యామలం చేసిన ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు.

దేశాన్ని ధనికులు ఆదాని, అంబానీ కి నరేంద్రమోదీ తాకెట్టు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. పోరాటం చేసి దేశ సంపదను కాపాడుకోవసిన పరిస్థితి నెలకొందని.. స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ హత్య చేసిందని ఆగ్రహించారు. మరోకైనా జాతిపిత అని చెప్పుకుంటూ గాంధీ గారిని చంపిన నాయకుడికి వత్తాసు పలుకుతున్నారని.. మన కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీని గుర్తుగు చేసుకోండని కోరారు. ఆజాదీ కా గౌరవ యాత్ర ఉద్దేశ్యం స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళను గౌరవిఎంచుకోవడమని పేర్కొన్నారు భట్టి.