తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – అమిత్ షా

-

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బిజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో రెండో రోజు రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి అమిత్ షా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో బిజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో కూడా బిజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి రానుందని పేర్కొన్నారు. రాజకీయాలను సేవ కోసం వినియోగిస్తాం.. బిజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతుందని ఫైర్‌ అయ్యారు అమిత్‌ షా.

కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పతి ఎన్నికలో బిజేపీ గతంలో దళితునికి అవకాశం కల్పించింది.. ఇప్పుడు గిరిజన, ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించిందని తెలిపారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా లో బిజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు అమిత్‌ షా.

Read more RELATED
Recommended to you

Latest news