లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మేపరిస్థితుల్లో ప్రజలు లేరు : ఎంపీ లక్ష్మణ్

-

కాంగ్రెస్‌ పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్‌ నేత నిరంజన్‌రెడ్డి.. 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారని, కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలు అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రజలు నమ్ముతున్నారన్న లక్ష్మణ్.. హస్తం పార్టీకి ఎందుకు ఓటు వేయాలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంలో అవినీతిని బయటికి తీస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి .. దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ నేతలు అవినీతిపరులన్న రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడెందుకు వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version