అభ్యర్థులను మార్చే యోచనలో బీఆర్ఎస్..?

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలు అయింది. అందరికంటే ముందు అధికార బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది.తొలి జాబితాలో 114 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. 114 మందిలో 63 మంది అభ్యర్థులకు ఇంకా  బీఫామ్‌లు అందలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ తొలి జాబితా అభ్యర్థులలో టెన్షన్ వాతావరణం మొదలైంది. కేవలం  51 మందికే ఈరోజు బీఫామ్‌లు ఇచ్చారు సీఎం కేసీఆర్.

ఇది సెంటిమెంటా? లేదా మరేదైనా కారణమా? అని పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు  ప్రకటించిన కొంతమంది అభ్యర్థుల్లో మార్పు ఉండొచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.  అలంపూర్‌లో అభ్యర్థి మార్పు ఖాయమా?.. అబ్రహం ప్లేస్‌లో విజేయుడు? కి బీఫామ్ అందజేస్తారా అనే చర్చ జరుగుతుంది. అదేవిధంగా కోదాడలో కూడా బీఆర్ఎస్ లో రెండు వర్గాలుగా చీలి పోయింది. బొల్లం మల్లయ్య యాదవ్ కి టికెట్ ఇవ్వడం పట్ల కొంత మంది వ్యతిరేకంగా ఉన్నట్టు సమాచారం. నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా రమావత్ రవీంద్ర కుమార్ కి టికెట్ కేటాయించడంతో వడ్త్యా దేవందర్ నాయక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో మరో ముగ్గురు అభ్యర్థులను కూడా మారుస్తారనే  ప్రచారం సాగుతుంది. ఏం జరుగుతుందనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version