తనని బహిష్కరిస్తే బీఆర్ఎస్ పార్టీకే నష్టమని అన్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. సస్పెండ్ చేసినందుకు తనకు సంతోషంగానే ఉందన్నారు. కొల్లాపూర్ లో తన అనుచరులతో సమావేశమైన ఆయన.. మంత్రి నిరంజన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. తమ నియోజకవర్గంలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తప్పా..? అని నిలదీశారు.
తెలంగాణలో ప్రశ్నించే గొంతుక ఉండొద్దా అని అన్నారు జూపల్లి. గతంలో బిఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను ఏ విధంగా చేర్చుకుందని ప్రశ్నించారు. పరిపాలన గురించి తాను చాలాసార్లు మాట్లాడానని అన్నారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు జూపల్లి. ఇప్పటివరకు తాను అడిగిన ప్రశ్నలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పలేదన్నారు.