శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద చిరుత కలకలం రేపింది. దీంతో చిరుతను పట్టుకునేందుకు అధికారులు కష్టపడుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు శ్రమిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. 9 ట్రాప్ కెమెరాలు, ఒక బోన్ ఏర్పాటు చేశారు. బోన్ లో మేక ను ఉంచారు ఫారెస్ట్ అధికారులు. రెండు రోజుల క్రితం ఫెన్సింగ్ దూకి రన్ వే పైకి వచ్చింది చిరుత. ఫెన్సింగ్ దూకడంతో అలారమ్స్ మోగాయి.
ఈ తరుణంలోనే… సీసీ కెమెరాల ద్వారా… చిరుత ను గుర్తించారు ఎయిర్పోర్ట్ అధికారులు. అనంతరం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రెండు రోజులుగా చిరుత కోసం గాలిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ట్రాప్ కెమెరాల్లో చిరుత సంచరించినట్లు తెలిస్తే… అదే ప్రాంతంలో ఈరోజు చిరుత కోసం గాలించనున్నారు ఫారెస్ట్ అధికారులు.